Sunday, November 28, 2021

లొకేష‌న్ వేట‌లో హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు టీం..


చారిత్ర‌క నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు. ఈ చిత్రంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్నాడు. తాజా షెడ్యూల్ కి సంబంధించిన భారీ సెట్స్ రెడీగానే ఉన్నాయి. ఆ తరువాత షెడ్యూల్ కి అవసరమైన లొకేషన్స్ ను ఎంపిక చేసే పనిలో ద‌ర్శ‌కుడు క్రిష్ టీమ్ బిజీగా ఉంది. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.సువిశాలమైన మైదానాలను క్రిష్ పరిశీలిస్తున్నాడు. మరి అక్కడ ఏవైనా సెట్స్ వేయిస్తాడా.. లేదంటే గుర్రాలపై ఛేజింగ్ సీన్స్ ను ఏమైనా ప్లాన్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. పవన్ సరసన నాయికగా నిధి అగర్వాల్ నటిస్తుండగా, ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ ఆర్టిస్టులు కూడా కనిపించనున్నారు.

Related Articles

- Advertisement -

Latest Articles