Tuesday, December 7, 2021

Sridevi : పెళ్లి చేసుకుంటా.. అని చెప్పినా శ్రీదేవి పెళ్లి ప్రపోజల్ ను రిజెక్ట్ చేసిన కమల్ హాసన్? | The Telugu News


Sridevi : అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తను ఇప్పుడు మన మధ్య లేకపోయినా.. తన మెమోరీస్ మాత్రం తన అభిమానులతోనే ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులతోనే ఉన్నాయి. ఒక్క తెలుగు ప్రేక్షకులే కాదు.. యావత్ భారతదేశ సినీ ప్రేమికులు శ్రీదేవిని ఆరాధించారు. ఒకప్పుడు తన సినిమా రిలీజ్ అయితే చాలు.. సినీ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యేవాళ్లు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ లక్షల మంది అభిమానులను సంపాదించుకుంది శ్రీదేవి.

kamal haasan rejected sridevi marriage proposal

శ్రీదేవి నిజానికి తన సినీ కెరీర్ ను ప్రారంభించింది తమిళంలో. ఆ తర్వాత మలయాళం సినిమాల్లో నటించింది. తమిళంలో తన కెరీర్ మొదట్లో ఎక్కువగా కమల్ హాసన్ తో నటించింది శ్రీదేవి. చాలా సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు. అప్పట్లో ఈ జంటకు ఫుల్ క్రేజ్ ఉంది. తెలుగులోనూ వాళ్లకు చాలా క్రేజ్ ఉండేది.అప్పట్లో శ్రీదేవి, కమల్ హాసన్ మధ్య సాన్నిహిత్యం కూడా ఎక్కువగా ఉండేది. దీంతో ఆ జంట మధ్య ఏదో ఉందని అందరూ అనుకునేవారు. దీంతో..

Sridevi : కమల్ తో పెళ్లి చేయాలని అనుకున్న శ్రీదేవి తల్లి

వాళ్ల జోడి బాగుంటుందని అనుకున్న శ్రీదేవి తల్లి కమల్ తో శ్రీదేవిని ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నదట. దీంతో కమల్ దగ్గరికి వెళ్లి.. తన కూతురును పెళ్లి చేసుకోవాలని శ్రీదేవి తల్లి.. కమల్ ను కోరిందట.కానీ.. ఆమె ప్రపోజల్ ను కమల్ హాసన్ తిరస్కరించాడట. శ్రీదేవితో జంటగా సినిమాల్లో పనిచేశాను కానీ.. తను నాకు చెల్లెలుతో సమానం. ఆమెను పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు.. అని చెప్పాడట కమల్.

మేమిద్దరం సినిమాల్లో మాత్రమే హీరో హీరోయిన్లుగా నటిస్తాం. భార్యాభర్తలుగా నటిస్తాం. కానీ.. రియల్ గా మాది అన్నాచెల్లెళ్ల బంధం అని చెప్పాడట. అలాగే.. తనంటే నాకు చాలా గౌరవం అని కూడా కమల్ తనతో చెప్పాడట. అలా.. కమల్ హాసన్, శ్రీదేవి పెళ్లి మ్యాటర్ కు పుల్ స్టాప్ పడిందన్నమాట. ఒకవేళ.. కమల్ హాసన్ శ్రీదేవిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొని ఉంటే.. ఇప్పటి పరిస్థితులు వేరేలా ఉండేవి.

Related Articles

- Advertisement -

Latest Articles